ఫార్ములా వన్ రారాజు మైకేల్ షూమాకర్ తనయుడు మైక్ షూమాకర్ తొలిసారి ఎఫ్1 మజాను ఆస్వాదించబోతున్నాడు. 2021 సీజన్లో అతడు హాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని హాస్ జట్టు ధ్రువీకరించింది. మరికొద్ది రోజుల్లో జరిగే ప్రాక్టీస్‌లో 21 ఏళ్ల మైక్ తన సత్తా ఏంటో చూపించేందుకు తహతహలాడుతున్నాడు. ‘జర్మనీకి చెందిన మైక్ షూమాకర్‌తో హాస్ ఒప్పందం కుదుర్చుకుంది. 2021 ఎఫ్‌ఐఏ ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం ఎంచుకున్న కొత్త డ్రైవర్ల లైనప్‌లో అతడు భాగమవుతాడు’ అని హాస్ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా డ్రైవర్ నికితా మేజ్‌పిన్ (21) ఎఫ్1 రేసులో మైక్ భాగస్వామిగా ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఫార్ములా 2 డ్రైవర్లు స్టాండింగ్స్‌లో మైక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో మిగిలిన ఆఖరి రేసు బహ్రెయిన్‌లో ఈ వారంతంలో జరగనుంది. మైక్ తండ్రి మైకేల్ ఏడుసార్లు ఫార్ములావన్ విజేతగా అవతరించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డును లూయిస్ హామిల్టన్ ఈ ఏడాదే సమం చేశాడు. 2013లో షూమాకర్ ఒక రేసులో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అతడు కోలుకోవాలని కుటుంబ సభ్యులు ఎంతగానో ఆరాటపడుతున్నారు.
మైక్ షూమాకర్ వస్తున్నాడు
Related tags :