ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నివాసంలో గురువారం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నం నుంచి వచ్చిన యాంటీ బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది స్నిప్పర్ డాగ్ సాయంతో ఇంటి ఆవరణ, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి కొడాలి నాని ప్రయాణించే వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ఇటీవల రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి కొడాలి నాని నివాసంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర నలుమూలల నుంచి మంత్రి నాని నివాసానికి వచ్చే వారిని మెటల్ డిటెక్టర్, స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.
కొడాలి నాని ఇంట్లో బాంబ్ స్క్వాడ్
Related tags :