Food

ముల్లంగి ఇష్టం లేకపోయినా తినాలి

Raddish Must Be A Part Of Diet - Telugu Good Foods

ముల్లంగిని కొందరు ఇష్టపడరు కానీ ఇది పోషకాల ఖజానా అంటున్నారు ఆహార నిపుణులు. వీటిని కూర, సలాడ్‌, పప్పులో వేసుకోవచ్చు. ఈ దుంపతో చర్మ, కేశ సౌందర్యం పెరుగుతుంది కూడా. మెనూలో తప్పక ఉండాల్సిన ఈ దుంప వల్ల కలిగే లాభాలివి.. ముల్లంగిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముల్లంగి సలాడ్‌ తింటే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవు.కేలరీలు తక్కువగా ఉండే వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గేందుకు ముల్లంగి తోడ్పడుతుంది.ముల్లంగిలోని యాంటీ ఆక్సిండెట్లు జలుబు, దగ్గుల నుంచి రక్షిస్తాయి.దీనిలోని ఎ, సి, ఇ, బి6 విటమిన్లు, పొటాషియం, ఇతర లవణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముల్లంగిలోని ఆంథోసయనిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌ గుండె సంబంధ వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.రక్తపీడనం అదుపులో ఉంటుంది. దీనిలోని పొటాషియం రక్తంలోని సోడియం-పొటాషియం నిల్వలను నియంత్రిస్తుంది.దీనిలోని ఫాస్ఫరస్‌, జింక్‌ చర్మం మీది మచ్చలు, నల్లటి వలయాలను తొలగిస్తాయి. అంతేకాదు చర్మాన్ని పొడిబారనివ్వవు.