NRI-NRT

10మంది కర్నూలు విద్యార్థులకు తానా ఉపకారవేతనాలు

One Lakh Rupees-TANA Foundation Cheyootha Helps 10Kurnool Poor Students

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ “చేయూత” ప్రోగ్రాం ద్వారా కర్నూలు కి చెందిన విద్యార్థులకు లక్ష రూపాయల పారితోషికాలు అందజేశారు. కర్నూలు సస్య హోటల్ లో జరిగిన కార్యక్రమంలో డిఎస్పీ బాబు ప్రసాద్ కర్నూలుకు చెందిన అఖిల, ద్వారకానాథ్, లోకేష్, మౌనిక, రాఘవేంద్ర, ప్రవీణ్, రేణుక, షేక్ హసీనా, వైష్ణవి, శ్రీ చరణ్ లకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున పారితోషికాలు అందజేశారు. కరోనా వైరస్ వలన ప్రతిభాపాటవాలు కలిగిన చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారికోసం తానా కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది విద్యార్థులకు కర్నూలు జిల్లాలో పారితోషికాలు అందించామని కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ తెలిపారు. రామ్ చౌదరి ఉప్పుటూరి, రమణ పెద్దు, రామకృష్ణ జవ్వాజి, తేజ గోళ్ళ, బిల్హన్ ఆలపాటి కూడా ఈ కార్యక్రమానికి సహకరించారని, తానా ఫౌండేషన్ కోశాధికారి శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో చేపడుతున్న “చేయూత” కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యు (1000) మందికి పైగా విద్యార్థులకు పారితోషికాలు అందించామని తానా కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మినేని మీనాక్షి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.