Politics

జనవరిలో తలైవా పార్టీ

జనవరిలో తలైవా పార్టీ

సుదీర్ఘ సందిగ్ధానికి తెరదించుతూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గురువారం వెల్లడించారు. దీంతో తమిళనాట రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా తలైవా రాజకీయ అరంగేట్రంపై హర్షం వ్యక్తం చేశారు. విజయం మీదే అంటూ సోషల్‌మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాల్లో ‘మారుస్తాం.. అన్నీ మారస్తాం’.. ‘ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదు’ అని తమిళంలో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.