Sports

నివాళి అర్పించినందుకు జరిమానా

నివాళి అర్పించినందుకు జరిమానా

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనాకు నివాళి తెలిపేందుకు చేసిన చర్యతో అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీపై జరిమానా వేటు పడింది. స్పానిష్‌ లీగ్‌లో బార్సిలోనా తరఫున ఒసాసునా జట్టుపై గోల్‌ సాధించాక మెస్సీ తన షర్టును విప్పి లోపల తాను వేసుకున్న మారడోనా జెర్సీని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆకాశం వైపు చూసి రెండు చేతులు పైకెత్తి ముద్దులు పెడుతూ డిగోకు నివాళి అర్పించాడు. అయితే మ్యాచ్‌ గోల్‌ చేసిన సంబరాల్లో షర్టు విప్పడం లీగ్‌ నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించిన స్పానిష్‌ సాకర్‌ సమాఖ్య మెస్సీకి రూ.53,115, బార్సిలోనాకు రూ.15,934 జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా 4-0తేడాతో ఒసాసునాపై గెలిచింది.