కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నుంచి బిజీగానే ఉన్నారు. తన భర్త గౌతమ్‌తో కాజల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు అక్కడ బ్రాండ్స్‌కు ప్రమోషన్ చేసింది. ఇప్పుడు తన భర్త గౌతమ్ కంపెనీకి బ్రాండింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. గౌతమ్ ప్రముఖ డిజైనింగ్ కంపెనీకి అధినేత. ముంబైలో లీడింగ్ బిజినెస్ మ్యాన్ కూడా. ఇప్పుడు ఈయనకు తోడుగా కాజల్ వచ్చి చేరింది. భర్త కిచ్లుకి సంబంధించిన ఇ-కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి ఎండోర్స్ మెంట్ చేస్తోంది కాజల్. ఈ సంస్థ త్వరలోనే కాజల్‌తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను కూడా విడుదల చేయబోతుంది. ఆ మేరకు వివరాల్ని కాజల్ స్వయంగా వరుస ట్వీట్లలో వెల్లడించింది.
పతి సేవలో…

Related tags :