Politics

సోమవారం కేసీఆర్ సమీక్ష

సోమవారం కేసీఆర్ సమీక్ష

యాసంగి పంటకు రైతుబంధు సాయం కోసం నిధుల విడుదల, పంపణీపై డిసెంబర్‌ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వ్యవసాయ, ఆర్థికశాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. సమీక్ష అనంతరం రైతుబంధు సాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.