వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేయనున్నట్లు రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ తెలిపారు. లౌకిక, ఆధ్యాత్మిక రాజకీయాలు కలిసి పని చేయడం అసాధ్యమన్న విమర్శలను మణియన్ కొట్టిపారేశారు. అలాంటి రాజకీయాన్ని రజనీకాంత్ సుసాధ్యం చేసి చూపుతారని అన్నారు. ఈ తరహా రాజకీయాలను తొలుత మహాత్మగాంధీ ప్రతిపాదించారని గుర్తుచేశారు. ప్రజలకు తాము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పి ప్రజలకు చేరువ కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
రజనీ చేయబోయేది మహాత్మాగాంధీ రాజకీయం

Related tags :