సాగరకన్య శిల్పా శెట్టి వ్యాపార రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బాస్టియన్ పేరుతో రెస్టారంట్లు నడుపుతున్నారు. తాజాగా వర్లీలో మరో శాఖను ఆరంభించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ శిల్పా ఫొటోలు షేర్ చేశారు. రెస్టారంట్ సిద్ధమైందని, త్వరలోనే ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో తొలిసారి రాత్రిపూట ఇంటి నుంచి బయటికి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రెస్టారంట్ మెనూ తయారు చేసే పనిలోపడ్డట్టు తెలిసింది. ఇందు కోసం నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాల సహాయం తీసుకున్నారు. ‘శిల్పా, రాజ్‌కు ధన్యవాదాలు. న్యూ బాస్టియన్‌లో నిన్న సాయంత్రం ఎంతో అందంగా గడిచింది. ఆహారం ఎంతో రుచికరంగా ఉంది…’ అని జెనీలియా పేర్కొన్నారు. తమ మెనూలోని ఫుడ్‌ను రితేష్ జంట రుచి చూశారని రాజ్ కూడా పోస్ట్ చేశారు. ఎంతో ఖర్చుతో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శిల్పా న్యూ బాస్టియన్
Related tags :