Movies

RRR బృందంలో జేరిన ఆలియా

RRR బృందంలో జేరిన ఆలియా

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందంలో చేరిపోయింది. ప్రస్తుతం బీటౌన్‌లో వరుస సినిమాలతో తీరికలేకుండా ఉంది. కాగా.. షెడ్యుల్‌లో భాగంగా ఆమె ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌తో కలిసిపోయింది. రేపట్నుంచి(సోమవారం) నుంచి ఆమె షూటింగ్‌లో బిజీబిజీగా గడపనుంది. ఈ భామ రామ్‌చరణ్‌కు జోడీగా కనిపించనుంది. చెర్రీ-ఆలియా మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఇటీవల హైదరాబాద్‌లో సుదీర్ఘ షెడ్యుల్‌ ముగించుకొని మహారాష్ట్రకు చేరుకుంది. అక్కడ పుణెతో పాటు, మహాబలేశ్వర్‌లోనూ పలు సన్నివేశాలు చిత్రీకరించారు. మహాబలేశ్వర్‌లో ప్రకృతి అందాల మధ్య చిత్రీకరణ దృశ్యాలను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రామ్‌చరణ్‌, తారక్‌ మధ్య చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కూడా చెప్పింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్న విషయం అందరికీ తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.