“అమరావతి రాజధాని విషాదం” డాక్యుమెంటరీని పరకాల ప్రభాకర్ ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిపై సమగ్రమైన అధ్యాయనం, సరైన సమాధానం దొరికేందుకు..60 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించామన్నారు. త్వరలో సామాజిక మాద్యమాల్లో అమరావతి డాక్యమెంటరీ విడుదల చేస్తామన్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్ వరకు.. అక్కడి నుంచి అమరావతి వరకు రాజధాని ప్రయాణాన్ని ప్రస్తావించామన్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాం ద్వారా ఈనెల చివరి వారంలో విడుదల చేస్తామన్నారు. రాజధాని తరలింపు ఉద్యమాన్ని..ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకే ఈ ప్రయత్నమని పరకాల ప్రభాకర్ వెల్లడించారు.
అమరావతిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన పరకాల
Related tags :