Movies

ఖురేషీ ఫ్రమ్ బాంబే

Amreen Qureshi Wants You To Call Her Telugu Girl

‘‘మంచి కథాబలమున్న చిత్రాల్లో నటిస్తూ.. అన్ని దక్షిణాది భాషల్లోనూ హీరోయిన్‌గా మంచి విజయాలు అందుకోవాలన్నదే నా లక్ష్యం’’ అంటోంది అమ్రిన్‌ ఖురేషి. హైదరాబాద్‌లోనే పుట్టిన పెరిగిన ఈ అచ్చ తెలుగు ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో ఆమె నటిస్తున్న ‘బ్యాడ్‌బాయ్‌’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. తెలుగు హిట్‌ చిత్రం ‘సినిమా చూపిస్తమావ’కు హిందీ రీమేకిది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకుడు. ఈ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది అమ్రిన్‌. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టా. శివ శివాని పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నా. ముంబయిలో నటనలో శిక్షణ తీసుకున్నా. నా తొలి చిత్రం కోసం హైదరాబాద్‌కి రావడం చాలా థ్రిల్లింగా ఉంది.’’ అంది.