Politics

రేపు ఏలూరుకు జగన్-తాజావార్తలు

CM Jagan To Visit Eluru Mystery Disease Victims

* ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని సీఎం వైయస్‌.జగన్‌ సోమవారం పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరుతారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే ముఖ్యమంత్రి ఈఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు.

* జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఓడిన డివిజన్లలో ఓడిన వారిని దూరం పెట్టకుండా అందరూ కలిసి పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్న లోపం లేదని, ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. సిట్టింగ్‌లను మార్చిన దగ్గర గెలిచామన్న ఆయన.. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఇక్కడే లెక్క తప్పిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని, గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలన్నారు.

* గ్రేటర్ ఎన్నికల్లో మన ప్రయత్నంలో లోపం లేదు, ఎమోషన్ ఎలక్షన్ జరిగింది.. అందుకే ఇలాంటి ఫలితం వచ్చింది.సిట్టింగ్‌లను మార్చిన దగ్గర మనం గెలిచాం.. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలామంది ఓడిపోయారు.. ఓడిన డివిజన్లలో ఓడిన వారే మన కార్పొరేటర్లు.. వారిని దూరం పెట్టకుండా అందరూ కలిసి పనిచేయండి-కేటీఆర్

* ఏలూరు అనూహ్య ఆనారోగ్య పరిస్థితి పై స్పందించిన ఎం.పి.ఙివిఎల్ నరసింహారావు.సంఘటన జరిగి మా దృష్టికి వచ్చిన వెంటనే కేంద్ర ఆరోగ్య మండలి సహాయం కోరాము.అంతిచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాధితుల ఆరోగ్య సహయార్థం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రంద్వీప్ గులేరియాను సంప్రదించి వెంటనే మంగళగిరి ఎయిమ్స్ లో సుప్రసిద్ధ నిపుణులతో మాట్లాడాం.వెనువెంటనే ఎయిమ్స్ నిపుణుల వైద్య బృందం ఏలూరులో పర్యవేక్షిస్తుంది.వందల మంది అస్వశస్థతకు మాస్ హిస్టీరియకాదు…టాక్సిన్స్ వల్ల కలిగే అస్వస్థత అయ్యివుండవచ్చు అని చెప్పిన వైద్య నిపుణులు. ఎయిమ్స్ వైద్య నిపుణుల సహకారాన్ని వినియోగించుకోవాలని మనవి.ఇంతకుముందే మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు క్షతగాత్రులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి వైద్యులతో మాట్లాడారు.

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మద్దతు ప్రకటించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. భారత్‌ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల పోరాటం న్యాయబద్ధమైనది, వారి డిమాండ్స్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతినిస్తుందని ఆదివారం ఓ ప్రకటన ద్వారా సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు..

* టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ, నటి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం అందింది. కాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె ఆదివారం రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాగా నేడు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.వాస్తవానికి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. దీంతో ఆమె కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేకపోవడమే కాకుండా పార్టీ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు జరిగిన సమావేశాలకు విజయశాంతిని ఆహ్వానించినా వెళ్లకుండా తన ఉద్దేశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపారు. ఇక, దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమెను పార్టీ కానీ, పార్టీని ఆమె కానీ పట్టించుకోలేదు. రాష్ట్ర నాయకత్వం కూడా విజయశాంతి వస్తే స్వాగతిస్తామని, పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక ఆహ్వానాలు ఉండవనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆమె మళ్లీ పాత గూటికే చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించినా… పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా విజయశాంతి చివరికి హస్తం వీడేందుకే సిద్ధపడ్డారు. బీజేపీ పెద్దలు కూడా ఆమె రాకను స్వాగతించడంతో విజయశాంతి హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి కమలానికి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దీంతో ఆమె మళ్లీ పాత గూటికే చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించినా… పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా విజయశాంతి చివరికి హస్తం వీడేందుకే సిద్ధపడ్డారు. బీజేపీ పెద్దలు కూడా ఆమె రాకను స్వాగతించడంతో విజయశాంతి హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి కమలానికి జై కొట్టనున్నారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. పలు దఫాలుగా కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో రైతు సంఘాలు ఈ నెల 8న భారత్‌ బంద్‌ తలపెట్టాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌, తెరాస, డీఎంకే, ఆప్‌ తదితర పార్టీలు ప్రకటించాయి.

* కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం కారణంగా మరో 20కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వారితో కలిపి 2030 నాటికి దాదాపు మొత్తం 100కోట్ల మంది కటిక పేదరికాన్ని అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే దశాబ్ద కాలంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై యూఎన్‌డీపీ తాజాగా అంచనాలు వేసింది.

* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో అమిత్‌షాను కలిశారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆమె షా నివాసానికి వెళ్లారు. సోమవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి కాషాయదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది.

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలో ప్రముఖ గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌ పాల్గొన్నారు. వారి డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎముకలు కొరికే చలిలోనూ పట్టువదలకుండా నిరసనలో పాల్గొంటున్న అన్నదాతల దుస్తుల కోసం దిల్జిత్‌ రూ.కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించకపోవడం విశేషం.

* కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే వ్యాక్సిన్‌ కంటైయినర్లు సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి. వీటిని ఈ మంగళవారం నుంచే ప్రజలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ కార్యక్రమంగా అభివర్ణించిన బ్రిటన్‌, తొలుత 50 జాతీయ ఆరోగ్య సేవల(ఎన్‌హెచ్‌ఎస్‌) ఆసుపత్రుల్లో పంపిణీని చేసేందుకు సిద్ధమైంది.