NRI-NRT

H1B పేరిట తెలుగు విద్యార్థులను ముంచిన ముత్యాల సునీల్-ప్రణీత

Interpol Lookout On Muthyala Sunil Praneetha Fraud Over H1B

అమెరికాలో H1 వీసాల పేరుతో 30మంది తెలుగు విద్యార్థులను ఓ కిలాడీ జంట ₹10కోట్లకు ముంచింది. పశ్చిమ గోదావరికి చెందిన ముత్యాల సునీల్-ప్రణీతలు F1 వీసాలపై ఉన్న 30 మంది విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుండి H1B ఇప్పిస్తామని నమ్మబలికి $25వేల డాలర్లు వసూలు చేశారు. మొత్తంగా ₹10కోట్లను వసూలు చేసిన ఈ “ముత్యాలు” సునీల్ తండ్రి సత్యనారాయణ ఖాతాలోకి వీటిని మళ్లించి అమెరికా నుండి పరారీ అయ్యారు. వీరు ప్రస్తుతం యూరప్‌లో ఉండవచ్చునని సమాచారం. వీరి దురాగతాన్ని గుర్తించిన విద్యార్థులు నార్త్ కరోలినా హోంల్యాండ్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా సునీల్-ప్రణీతలపై ఇంటర్‌పోల్ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సునీల్ తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉనారు. కన్సల్టన్సీల ముసుగులో ఇలాంటి H1B అక్రమాలకు పాల్పడే వారిని నమ్మవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. సంస్థ పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని తదనుగుణంగా వీసా ప్రక్రియను ప్రారంభించుకోవాలని సూచించారు.

Updated Monday Dec 07 2020 – 930PM CST. Muthyala Sunil Clarifies in video from North Carolina.

Please see this new post here – https://www.tnilive.com/?p=76434