కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి యావత్ దేశం రైతులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని ప్రవాసులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తాజాగా బ్రిటన్‌లోని భారతీయులు రైతులకు మద్దతు తెలుపుతూ ఆదివారం రోజు నిరసనలు చేపట్టారు. స్కిక్కు కమ్యూనిటీకి చెందిన వేలాది మంది భారతీయులు సెంట్రల్ లండన్‌లో ర్యాలీలు తీశారు.
మోడీ రైతు బిల్లుపై లండన్‌లో నిరసన
Related tags :