ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. దీనిపై ధర్మాసనం ధరణి జీవోల కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గతంలోలాగానే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది.
ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10వ తేదీ వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధరణి పోర్టల్‌పై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు సూచించింది.
తెలంగాణ హైకోర్టు
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. దీనిపై ధర్మాసనం ధరణి జీవోల కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని అడ్వకేట్ జరనల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ కోసం సేకరించిన డేటాకు చట్టబద్దమైన భద్రత ఉండాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.