Health

తెలంగాణాలో కోటి 60లక్షల టీకాలు సిద్ధం

Telangana To Issue 1Cr 60Lakh Vaccines Starting January 2nd

కరోనా నియంత్రణ టీకాలు వేయటానికి తెలంగాణ వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతోంది. ముందుగా నాలుగు విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేయాలని నిర్ణయం తీసుకుంది. వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల్లో 80 లక్షల మందిని గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక కోటి 60 లక్షల టీకాలు సిద్ధం చేసే పనిలో ఉన్నామన్నారు. జనవరి రెండో వారం‌ నుంచి టీకాలు వేయటం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరకి రెండు డోసుల్లో టీకాలు వేయాలని కేంద్రం ఆదేశించిందని వెల్లడించారు. కరోనా నియంత్రణ టీకా 9 నుంచి 12 నెలల కాలం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉచితంగా టీకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా కరోనా నియంత్రణ టీకాలు ఇచ్చే ఆలోచన ఉందని ఏబీఎన్‌తో వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.