DailyDose

పెరుగుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితులు-నేరవార్తలు

పెరుగుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితులు-నేరవార్తలు

* ఏలూరు వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందారు.విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృత్యువాతపడ్డారు.ఏలూరులో వింత వ్యాధికి గురై పరిస్థితి విషమించడంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.వింత వ్యాధితో బాధపడుతున్న 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా… సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) మృతి చెందారు.సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. 

* పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.మానవహక్కుల పరిరక్షణకు సంబంధించిన గోడప్రతిని విడుదల చేశారు.మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని డీజీపీ వివరించారు.పోలీసుల వైపు నుంచి మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.పోలీసు వ్యవస్థలో మార్పులు చేపడుతున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

* సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర పెట్రోలు సీసాతో యువకుడుఓ సంచిలో పెట్రోలు సీసా, అగ్గిపెట్టె పెట్టుకుని… గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో తచ్చాడుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఓ సంచిలో పెట్రోలు సీసా, అగ్గిపెట్టె పెట్టుకుని…గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో తచ్చాడుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన వెంకటేష్‌ మంగళవారం తన సమస్యల్ని సీఎంకు వివరించేందుకు తాడేపల్లి వచ్చాడు.అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు ప్రశ్నించారు.సీఎంకు సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చినట్లు తెలిపాడు.

* ఖమ్మం జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. రేపు పెళ్లి ఉందనగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మూడో పట్టణ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ(48), ఆమె కూతుళ్లు రాధిక(30), రమ్య(28) బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గోవిందమ్మ కుటుంబం నిరు పేదరికంలో ఉండంటంతోపాటు ఇంటి పెద్దగా ఉన్న భర్త ఏ పనిచేయకపోవడంతో ఆమెను కష్టాల్లోకి నెట్టివేశాయి. అంతేగాక ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రాధికకు డిసెంబర్‌ 11న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో డబ్బులు సర్దుబాటు కాకవడంతో మనస్తాపం చెందిన తల్లి, కూతుళ్లతో కలిసి తానువు చాలించారు.