స్వలింగ సంపర్కురాలు అంటూ తనపై వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి నీలం కొఠారి స్పందించింది. తనపై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని ఆమె స్పష్టం చేసింది. 80-90 దశకాల్లో బాలీవుడ్ అభిమానులను అలరించిన ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు విషయాలు వెల్లడించింది. తనపై వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చింది.
నేను లెస్బియన్ కాదు
Related tags :