గల్ఫ్ దేశం ఒమన్ 103 దేశాలకు ‘వీసా ఫ్రీ’ ఎంట్రీ అవకాశం కల్పించింది. ఇలా తమ దేశానికి వచ్చిన విదేశీ పర్యాటకులు 10 రోజుల పాటు స్టే చేయొచ్చని పేర్కొంది. అయితే, సందర్శకులు తప్పనిసరిగా హోటల్ రిజర్వేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, రిటర్న్ టికెట్ కలిగి ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. “103 దేశాల జాతీయులకు సుల్తానేట్‌లోకి ప్రవేశ వీసాల నుండి 10 రోజుల పాటు మినహాయింపు ఉంది” అని ట్వీట్ చేసింది. ఇక గతవారం తమ దేశానికి సందర్శనకు వచ్చే విదేశీయులకు టూరిస్ట్ వీసాల జారీని ప్రారంభించినట్లు ఒమన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన ట్రిప్స్‌కు మాత్రమే ఈ వీసాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసింది. కాగా, అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ప్రారంభించిన ఒమన్.. కేవలం వాలీడ్ రెసిడెన్సీ, వర్క్ వీసాలు కలిగిన వారిని మాత్రమే అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే.
వీసాలపై ఒమన్ బంపర్ ఆఫర్
Related tags :