పార్లమెంటు ప్రస్తుత భవనానికి దేశ చరిత్రలో విశేష స్థానం ఉంది. అనేక చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది. బ్రిటిష్ పాలకుల నుంచి ప్రస్తుత మోదీ సర్కారు వరకు రూపొందించిన చట్టాలు, కీలక చర్చలకు ఈ భవనం సాక్షిగా నిలిచింది. పార్లమెంటు నూతన భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రస్తుత భవ నం విశేషాలు..
*బ్రిటిష్ పాలనలో ఐకానిక్ వృత్తాకార పార్లమెంటు భవనాన్ని నిర్మించారు.
*న్యూఢిల్లీని నిర్మించిన ఎడ్విన్ లుటియెన్స్, హెర్బె ర్ట్ బేకర్ ఈ భవనం డిజైన్‌ను రూపొందించారు.
*1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన. భవన నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. నిర్మాణ వ్యయం రూ.83 లక్షలు. భవనం వ్యాసం 560 అడుగులు.
*మొదటి అంతస్తులోని వరండాను 27 అడుగులున్న 144 సున్నపురాతి స్తంభాలతో నిర్మించారు.
*వృత్తాకారంలోని అతిపెద్ద సెంట్రల్ హాల్ ఈ భవనం ప్రత్యేకత. సెంట్రల్‌హాల్‌కు 3 వైపులా లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్ ఉండగా, మధ్యమధ్యలో తోటలున్నాయి.
*స్వదేశీ మెటీరియల్, భారత కార్మికులతో నిర్మిం చిన ఈ భవనం భారత సంస్కృతికి నిదర్శనం.
*1927 జనవరి 18న అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభం.
*చారిత్రక చర్చలు, ముఖ్యమైన చట్టాలు, అంత్యంత శక్తిమంతమైన భారత ప్రజాస్వామ్యానికి ఈ భవనం సాక్షిగా నిలిచింది.
*బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోనే జరిగింది. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి నాటి భారత ప్రధాని నెహ్రూ ఈ భవనం నుంచే ప్రసంగించారు.
*భారత రాజ్యాంగాన్ని కూడా ఈ సెంట్రల్ హాల్‌లోనే రూపొందించారు. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది కూడా ఈ భవనంలోనే.
*భారత రాజ్యాంగ సభ కూడా ఇదే భవనంలో 1946 డిసెంబరు 9 నుంచి 1950 జనవరి 24 వరకు కొనసాగింది.
*సుప్రీంకోర్టును 1950లో ఏర్పాటు చేయగా, ఆ ఏడాది జనవరి 28 నుంచి పార్లమెంటు లైబ్రరీ హాల్‌లోనే కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత భవనం నిర్మించే (1958) వరకు ఈ హాల్‌లోనే కొనసాగింది.
*బ్రిటిష్ పాలకుల కళ్లు తెరిపించడానికి భగత్ సింగ్ బాంబులు విసిరింది కూడా ఇక్కడే.
*2001లో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఈ భవనంపై దాడికి పాల్పడగా 9 మంది మరణించారు.
ఘన చరిత్రకు సాక్షి…పార్లమెంట్ భవనం
Related tags :