కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనలు తొలగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా అమల్లో ఉన్న నిబంధనలను తొలగిస్తూ వారుకూడా శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో భక్తులు దర్శనం చేసుకోవాలని సూచించింది. వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు లేవని.. ఎప్పటిలాగే దర్శనం చేసుకోవచ్చని తితిదే స్పష్టం చేసింది.
తిరుమల దర్శనం నిబంధనలు ఎత్తివేత
Related tags :