DailyDose

డీసీలోని గాంధీ విగ్రహ ధ్వంసానికి వేర్పాటువాదుల ప్రయత్నం-నేరవార్తలు

డీసీలోని గాంధీ విగ్రహ ధ్వంసానికి వేర్పాటువాదుల ప్రయత్నం-నేరవార్తలు

* ఖలిస్థానీ వేర్పాటువాదులు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహాన్ని తమ జెండాతో కప్పేసి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.,భారత్‌లో కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరుకు మద్దతుగా అమెరికాలోని సిక్కు సంఘాలు శనివారం భారీ కారు ర్యాలీ నిర్వహించాయి.,న్యూయార్క్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహియో తదితర నగరాల నుంచి ర్యాలీగా రాజధాని వాషింగ్టన్‌లోని భారత ఎంబసీకి చేరుకుని నిరసన తెలిపాయి.,అయితే, ఇదే అదునుగా భావించిన ఖలిస్థానీ వేర్పాటువాదులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారితో కలిసిపోయారు.,అనంతరం తమ జెండాతో గాంధీ విగ్రహాన్ని కప్పేసి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.,ఇది గమనించిన సెక్యూరిటీ అధికారులు వారించడంతో వేర్పాటువాదులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.,ఖలిస్థానీల దుశ్చర్యను భారత ఎంబసీ తీవ్రంగా ఖండించింది. దీనికి కారణమైన వారిని తప్పకుండా శిక్షించడం జరుగుతుందని రాయబార కార్యాలయం అధికారులు పేర్కొన్నారు.,ఇప్పటికే ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేశామని, సాధ్యమైనంత త్వరగా దోషుల్ని కోర్టు ముందకు తీసుకురావాలని కోరినట్లు చెప్పారు.,ఇక ఈ ఏడాది జూన్‌లో అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం యూఎస్‌లో ఉన్న విగ్రహాలు, మెమోరియళ్ల ధ్వంసం, అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు. దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది.,తాజాగా గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన వారిపై కూడా ఇదే చట్టాన్ని ప్రయోగించాలని ఎంబసీ తెలిపింది. దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది.

* నివర్ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు దెబ్బతిని రూ.లక్షలు నష్టపోవడంతో గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంకి చెందిన కౌలు రైతు ముత్త వరపు హరిబాబు(60) బాపట్ల పట్టణం జమ్ములపాలెం ఆర్ ఓ బి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

* భూ వివాదంలో తండ్రిని హతమార్చిన తనయుడు.,టి.నర్సాపురంలో భూ వివాదంలో తండ్రి కొడుకుల మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న వివాదం. ఈ క్రమంలోనే పొలంలో తండ్రిని నరికి హత మార్చిన కుమారుడు..,వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

* రాజంపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.,బోయినపల్లి వద్ద ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న మన్నూరు పోలీసులు.,15 మూటల బియ్యం , ఆటోను సీజ్ .

* చక్రాయపేట మండలం కుమారకాలవ వద్ద రోడ్ ప్రమాదం.,ట్రాక్టర్ ను డీ కొట్టిన బైక్ ఘటన లో ఒకరు మృతి.,మృతుడు ముద్దప్పగారి పల్లె గ్రామం వడ్డె పల్లె కు చెందిన పాపయ్య (60) గా గుర్తింపు.,వెంపల్లి ఆసుపత్రికి తరలింపు.,కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.