కథానాయికగా నా దృష్టిలో గ్లామర్ పాత్రలు, అభినయ ప్రధాన పాత్రలు అనే భేదాలేవి లేవు. పాత్ర ఏదైనా దానికోసం నేను పడే కష్టంలో ఏ విధమైన మార్పు ఉండదు’ అని చెబుతోంది లక్ష్మీరాయ్. గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ తమిళ, మలయాళ చిత్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది. ఇటీవల ఆమె నటించిన సినిమాల్లో గ్లామర్ పాత్రలకే ప్రాధానత్యనిస్తున్న లక్ష్మీరాయ్ మాట్లాడుతూ ‘గ్లామర్ పాత్రల్లో తక్కువ శ్రమ, నటనకు ఆస్కారమున్న పాత్రల్లో ఎక్కువ కష్టం ఉంటుదనేది పూర్తిగా అబద్ధం. సినిమా ఏదైనా నటన విషయంలో ఏ విధమైన తేడా వుండదు. అందాల ప్రదర్శనకో, అభినయ ప్రధాన పాత్రలకో పరిమితవడానికి నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. ఒకే విధమైన మూస పాత్రల్లో కనిపించడం నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు పాత్రలకు తగినట్లుగా బోల్డ్‌గా నటించాల్సి వస్తుంది. నాయికగా ఏం చేసినా అదంతా నటనలో ఓ భాగం మాత్రమే. అది కూడా తప్పంటే ఎలా? కథానాయికగా అన్ని రకాల పాత్రలు పోషించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది.
కష్టం సమానం
Related tags :