ఇది గుమ్మడికాయల సీజన్. గుజ్జు మాత్రం ఉంచి గింజల్ని తీసి అవతల పారేస్తున్నారా! అయితే ఒక్క నిమిషం.. వాటిల్లో ఉన్న పోషక విలువల్నీ ఆరోగ్య రహస్యాన్నీ తెలుసుకుంటే మరోసారి ఆ పని చేయరు. వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టడం కష్టమనుకునేవాళ్లకి రెడీమేడ్ ప్యాక్‌ల్లోనూ ఇవి దొరుకుతున్నాయి.
* గుమ్మడి గింజల్లో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్… వంటి ఖనిజాలతో బాటు సమృద్ధికరమైన ప్రోటీన్లూ, కొద్దిపాళ్లలో ఎ, బి విటమిన్లూ లభ్యమవుతాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లూ రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అనేక వ్యాధుల్ని నిరోధిస్తాయి. ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. పొట్టలోని పరాన్నజీవుల్నీ నాశనం చేస్తాయి.
* వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి నిద్ర పట్టేందుకూ కారణమవుతాయి.
* ఫలితంగా సోడియం శాతం తగ్గి బీపీ రాకుండా అడ్డుకుంటుంది. అయితే వీటిల్లో క్యాలరీల శాతం ఎక్కువ. కాబట్టి ఊబకాయులు వీటిని తిన్నప్పుడు ఇతరత్రా క్యాలరీలను తగ్గించుకోవాలి.
గుమ్మడి విత్తనాలతో బీపీ అదుపు
Related tags :