Movies

దర్శకుడు లిప్‌లాక్ అని వేధించాడు

దర్శకుడు లిప్‌లాక్ అని వేధించాడు

‘లిప్‌లాక్‌ సన్నివేశాలకు నేను కొంచెం దూరంగా ఉంటాను. అయితే ఓ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు.. హీరోతో లిప్‌లాక్‌ సన్నివేశాలు చేయాలని దర్శకుడు చెప్పారు. నేను దానికి ఒప్పుకోలేదు. ఆయన మరలా అడిగినప్పటికీ నేను అంగీకరించలేదు. దీంతో, అక్కడే ఉన్న నటుడు.. ‘తనకిష్టంలేదనప్పుడు వదిలేయండి. ఒకవేళ ఇప్పుడు తను బయటకు వెళ్లి ‘మీటూ’ ఆరోపణలు చేస్తే?’ అని అన్నాడు. నాకలాంటి ఉద్దేశం లేనప్పటికీ నటుడు చెప్పిన మాటతో దర్శకుడు సైలెంట్‌ అయ్యాడు. కేవలం, సరదాగా అడిగానని చెప్పాడు. నిజం చెప్పాలంటే ‘మీటూ’ ఉద్యమమే అలాంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి నన్ను కాపాడింది.’ అని సాయిపల్లవి తెలిపింది.