* జడ్జిలను దూషించిన కేసును విచారించిన ఏపీ హైకోర్టు – హైకోర్టు, జడ్జిలను దూషించిన కేసులో నివేదిక సమర్పించిన సీబీఐ – జడ్జిలను దూషించిన వారిపై ఎఫ్‍ఐఆర్ నమోదు చేశాం – నిందుతులు వివిధ దేశాల్లో ఉన్నందున వారిని విచారించేందుకు 4 నెలల సమయం పడుతుంది – అంతవరకు సమయం ఇవ్వాలన్న సీబీఐ తరపు న్యాయవాది – విచారణ వచ్చే ఏడాది మార్చి 31కి వాయిదా వేసిన హైకోర్టు.
* షాద్ నగర్ ఎటిఎంల దోపిడికి యత్నం.రెండు ఎటిఎం లను పగల కొట్టిన దండగులు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.సిసి కేమెరా లు పరిశీలిస్తున్న పోలీసులు.
* బెజవాడలో ఈరోజు ఇద్దరు తాజా మాజీ టీడీపీ కార్పొరేటర్ల మృతి.
* హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం. చౌటుప్పల్ దగ్గర పల్టీ కొట్టిన కాన్వాయ్ కారు. అందరూ సురక్షితం.
* ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బి. మద్దులూరు గ్రామానికి వీఆర్వోగా పనిచేస్తున్న పూండ్ల శ్రీహరిబాబు అదే గ్రామానికి చెందిన నన్నూరి మధుసూదనరావుకి చెందిన భూములను ఆన్లైన్లో సరిచేయడానికి మొత్తం లక్షన్నర రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది.
* తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ గురించి కేంద్ర మంత్రిని విలేకర్లు అడగ్గా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడారో ఆయన్నే అడగండి అని బదులిచ్చారు. ‘టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్. భారత్ బంద్‌లో పాల్గొన్న కేసీఅర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలి. బీజేపీ చేసే నిరసనలకు సైతం పోలీసులు సహకరించాలి. భారత్ బంద్‌లో స్వయంగా మంత్రులు పాల్గొనటం సిగ్గుచేటు. రాజకీయంగా మోదీని ఎదుర్కోలేకనే వ్యవసాయ చట్టాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. సీడ్ డెవలప్‌మెంట్ కోసం సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో ఐటీసీ కంపెనీ ఏర్పాటు చేశాం. ఎంఎస్పీకి ట్టబద్ధత కల్పిస్తాం. మార్కెట్ యార్డులను ప్రోత్సహిస్తాం. వేర్ హౌసింగ్‌ల కోసం తెలంగాణకు నిధులు మంజూరు చేశాం’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
* జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో జనాలపైకి 104 వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో 104 వాహనాన్ని పాక్షికంగా గ్రామస్తులు ధ్వంసం చేశారు. గాయాలపాలైన వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో జాలిగామలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సమాచారం.
* కూకట్‌పల్లి కళామందిర్ లో చోరీ.కళామందిర్ లో సెక్యూరిటీ గార్డ్ చోరీ చేసినట్లు గుర్తింపు.నైట్ డ్యూటీలో మనీ డ్రాయర్ నుండి తొమ్మిది లక్షల రూపాయల చోరీకి పాల్పడిన సెక్యూరిటీ గార్డ్ మోనీదాస్.శంషీగూడాలో కిరాయి ఉన్న ఇళ్ళు ఖాళీ చేసి కుటుంబంతో పరారైన మోనీదాస్.
* కోలార్‌లోని ఐఫోన్లు అసెంబుల్ చేసే విస్టర్న్ ప్లాంట్‌లో నిన్న రెండు గంటలపాటు ఏకదాటిగా జరిగిన హింసాత్మక ఘటనలో ఏకంగా రూ. 437 కోట్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ తెలిపింది.