చలి కాలంలో వచ్చే ఉసిరిని ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదని ఆయుర్వేదం ఎప్పటి నుంచో చెబుతోంది. అలాంటిది కరోనా సమయంలో తింటే మరీ మంచిదనీ, ఎ, సి విటమిన్లు సమృద్ధిగా ఉండే ఉసిరి కాయల్ని నేరుగా లేదా రసం రూపంలో తీసుకోవడం వల్ల ఫ్లూ జ్వరాల్లాంటివి రాకుండా ఉంటాయనీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ పేర్కొంటోంది. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే ఉసిరిని క్రమం తప్పక తినేవాళ్లలో తెల్లరక్తకణాల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టమైంది.
*ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె కండరాలకు బలాన్నివ్వడంతోపాటు చెడు కొలెస్ట్రాల్నీ తగ్గించడంతో హృద్రోగ సమస్యలూ తగ్గుతాయి.
* ఈ కాయల్లో అధికంగా ఉండే క్రోమియం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
* కెరాటిన్, ఐరన్… వంటివి ఉసిరిలో పుష్కలంగా ఉండటంతో అవి జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా చేస్తాయి. ఫలితంగా జుట్టు ఊడటం తగ్గుతుంది.
* ఈ కాయల్ని రోజూ తినడం లేదా రసం రూపంలో తాగేవాళ్లలో చర్మం మృదువుగా ఆరోగ్యంగా మెరుస్తుంటుంది.
చలికాలం ఉసిరి తినాలి
Related tags :