Movies

మళ్లీ మాదకద్రవ్యాల కేసులో….

మళ్లీ మాదకద్రవ్యాల కేసులో….

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌కు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) మరోసారి సమన్లు ఇచ్చింది. సుశాంత్‌ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్‌ డ్రగ్‌ కేసుపై ఎన్‌సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ డ్రగ్‌‌ ప్లెడర్‌లతో ఆర్జున్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో గత నవంబర్‌లో ఎన్‌సీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు అర్జున్‌ విచారించి అధికారులు తాజాగా తదుపరి విచారణకు ఆదేశిస్తూ మరోసారి మంగళవారం సమన్లు అందజేసింది. రేపు(డిసెంబర్‌ 16) ఎన్‌సీబీకి కార్యాలయానికి విచారణకు హాజరకావాల్సిందిగా ఎన్‌సీబీ పేర్కొంది.