‘అతడి ఏడుపుగొట్టు కథ మళ్లీ మొదలైంది. మాకు బ్రేకప్ అయ్యి, అతను విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అవుతోంది. అయినా ముందుకు సాగేందుకు తను ఇంకా ఇష్టపడటం లేదు. వేరే మహిళతో డేటింగ్ చేయడానికి ఇష్టపడటం లేదు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు అధిగమించి నేను ధైర్యంగా ముందుకు వెళ్తుంటే అతడు మళ్లీ డ్రామా మొదలుపెట్టాడు. ఈ చిన్నపాటి అఫైర్ గురించి ఇంకెంత దూరం వెళ్తావు హృతిక్’అంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై మండిపడ్డారు. ఇప్పటికైనా పాత విషయాలు మర్చిపోయి ముందుకు సాగాలని హితవు పలికారు. కాగా క్రిష్-3 సినిమాలో కలిసి నటించిన కంగన- హృతిక్‌లు ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కంగన హృతిక్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య ‘మెయిల్’ యుద్ధం నడిచింది. ఈ క్రమంలో తనకు కంగనాతో ఎటువంటి సంబంధం లేకున్నా ఆమె జీమెయిల్ అకౌంట్ నుంచి వందల సంఖ్యలో మెయిళ్లు వచ్చాయని, తన కుటుంబంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్ తరఫు లాయర్ మహేష్ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కంగనా ట్విటర్‌లో ఈ మేరకు స్పందించారు.
లాయర్ చేసిన పనికి…హృతిక్‌పై కంగనా ఆగ్రహం
Related tags :