DailyDose

తెలంగాణా మంత్రికి తెదేపా MLCకు కరోనా-తాజావార్తలు

Telugu News Roundup Of The Day - Puvvada Positive COVID

* కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా.. తనకు పాజిటివ్ అని తేలిందని..కాబట్టి తనకు ఫోన్ చేయడానికి కానీ.. కలుసుకోవడానికి కానీ ప్రయత్నించవద్దని ట్విట్టర్ వేదికగా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి.నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి.హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని పువ్వాడ అజయ్ వెల్లడించారు. విజయనగరం టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణికి కరోనా పాజిటివ్. సంధ్యారాణి  కుటుంబంలో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ. 

* తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా, నూతన న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా హిమ కోహ్లీ నియమితులయ్యారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమ కోహ్లీ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్‌లో ‘లా’ పూర్తి చేశారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి ..ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న గోస్వామి.ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ .తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ నిమాయకం.తెలంగాణ హైకోర్టు సీజే చౌహాన్ ఉత్తరాఖండ్ కు బదిలీ .ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీకి పదోన్నతి.

* రాజధాని అమరావతి రక్షణ కోసం జనభేరి పేరుతో ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు.

* లోక సంక్షేమం, ప్రపంచం ఆర్థికంగా తిరిగి కోలుకోవడం. కోసం ధనప్రద శ్రీ మహావిష్ణు యాగం నిర్వహించామని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాల లో మంగళవారం నిర్వహించిన ధనప్రద శ్రీ మహావిష్ణు యాగంలో ఆయన పాల్గొన్నారు.అనంతరం డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 19 ప్రభావం వల్ల ప్రపంచంతో పాటు టీటీడీకి కూడా సాధారణంగా రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు.ఈ నేపథ్యంలో యాగం చేయడం ద్వారా ప్రపంచ ప్రజలతో పాటు టీటీడీ కూడా ఇంతవరకు కోల్పోయిన ఆదాయం తిరిగి పొంది, ఇబ్బందులన్నీ అధిగమించి, అందరూ ఆరోగ్యం గా ఉండాలని శ్రీ వారిని, శ్రీ మహాలక్షిని ప్రార్థించామన్నారు.యాగం తో శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ధన ప్రద యాగం చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి దేవి అందరినీ ఆశీర్వదించి కోల్పోయి సంపద తిరిగి ప్రసాదిస్తారని వేద విశ్వవిద్యాలయం వి.సి.ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ వివరించారు.నారద పురాణంలో ఈ యాగం ప్రాముఖ్యత గురించి స్పష్టం గా పేర్కొన్నారని ఆయన తెలిపారు. సాధారణంగా పరమ శివుడి పూజకు బిల్వాలు, మహావిష్ణువు పూజకు తులసీ ఆకులు ఉపయోగిస్తారని అన్నారు.

* సామాన్యుడిపై సిలిండర్ ధరల భారం!ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌తో పాటు కూరగాయల ధరల పెంపు సామాన్యుల ఇళ్లలో మంట రాజేస్తుంటే..ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి.సగం నెలలో రెండు సార్లు ధరలను పెంచేసి గ్యాస్ వినియోగ దారులను చమురు కంపెనీలు భయపెడుతున్నాయి.అన్ని రకాల నిత్యావసరాలు పెరుగుతున్న సమయంలో ఎల్‌పీజీ గ్యాస్‌ను మరోసారి పెంచాయి.

* ఏపీలో కరోనా.. కొత్తగా 500 కేసులుఅమరావతి: ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 61,452 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి.దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 8,76,336కి చేరింది.ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు.కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,064కి చేరింది.ప్రస్తుతం ఏపీలో 4,660 యాక్టివ్‌ కేసులుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,09,37,377 నమూనాలను పరీక్షించారు.

* ఆస్తుల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్‌ అభిమతమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సులువైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసమే మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్‌ సబ్‌కమిటీ) ఏర్పాటైందని చెప్పారు. బీఆర్కే భవన్‌లో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమై రిజిస్ట్రేషన్లలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించింది. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులను మూడు విభాగాలు విభజించి సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. రద్దీగా ఉన్న కార్యాలయాల్లో ఎక్కువ మంది సిబ్బందితో రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు. రియల్‌ ఎస్టేట్‌కు ఎలాంటి ఆటంకాలు కలగరాదని సీఎం స్పష్టం చేశారని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.

* కరోనా మహమ్మారి కట్టడికి త్వరలోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి రానున్న క్రమంలో పంపిణీకి సన్నద్ధమవుతోంది కేంద్రం.ఈ మేరకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీపై రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

* రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. రెండోసారి శిరస్త్రాణం లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు.చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* ఈసారి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు రద్దయినట్లు తెలుస్తోంది.ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ.. కాంగ్రెస్​ లోక్​సభ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.

* ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూసి అమరజీవి పొట్టిశ్రీరాముల ఆత్మ క్షోభిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు నాంది పలికారని, ఆయన స్ఫూర్తితోనే విభజన తర్వాత రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతిస్తుంటే సీఎం జగన్‌ మూడు రాజధానులంటూ వితండవాదమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

* ఉద్యోగాల పేరుతో తెరాస ప్రభుత్వం నాటకాలాడుతోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం 34 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని వివరించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందనే నమ్మకం తమ పార్టీకి లేదని కోదండరాం స్పష్టం చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు జాతీయస్థాయి పురస్కారం దక్కింది. ఇంటర్‌ అపెరబుల్‌ క్రిమినల్ జస్టిస్‌ సిస్టం(ఐసీజేఎస్‌) అమలు, వినియోగంలో ఏపీ పోలీస్‌శాఖ మంచి పనితీరు కనబరిచి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐసీజేఎస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అవార్డులను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో డీజీపీ గౌతం సవాంగ్ అవార్డును అందుకున్నారు.

* రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పౌరుల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌తో జరిగిన ఆన్‌లైన్‌ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

* ఆయుష్‌, హోమియోపతి వైద్యులు కరోనా చికిత్సకు మందులు సూచించడం గానీ, వాటిని ప్రచారం చేయడం గానీ చేయకూడదని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇటువంటి ప్రిస్క్రిప్షన్లను నిషేధిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అదే సమయంలో కొవిడ్ నేపథ్యంలో‌ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్‌ వైద్యులకు కేంద్రం ఇచ్చిన సూచనలను కోర్టు సమర్థించింది.

* కరోనా టీకా సేకరణ విషయంలో మోదీ ప్రభుత్వం దేశీయ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. అదే సమయంలో టీకా సమర్థత విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. తక్కువ ధర, రవాణా సౌలభ్యాలే కేంద్రం దేశీయ కంపెనీలవైపు చూడడానికి ముఖ్య అంశాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరు కంపెనీల టీకాలు మూడో దశ ఔషధ పరీక్షలు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

* మన పిల్లలకు ఏం తెలియదని అనుకుంటే పొరపాటే అని టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అన్నారు. వాళ్లను అతి గారాబం చేయడం మంచిది కాదన్న ఆయన.. వాళ్లకు కుటుంబ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. వాళ్ల ముందు మనం మనలాగే ఉండాలే తప్ప.. నటించడం సరికాదని అన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా అడల్స్ట్‌(పెద్దలు) అనే అంశంపై ఆయన మాట్లాడారు.