Devotional

తితిదే ఆధ్వర్యంలో మహావిష్ణు యాగం

తితిదే ఆధ్వర్యంలో మహావిష్ణు యాగం

లోక సంక్షేమం, ప్రపంచం ఆర్థికంగా తిరిగి కోలుకోవడం. కోసం ధనప్రద శ్రీ మహావిష్ణు యాగం నిర్వహించామని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాల లో మంగళవారం నిర్వహించిన ధనప్రద శ్రీ మహావిష్ణు యాగంలో ఆయన పాల్గొన్నారు.అనంతరం డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 19 ప్రభావం వల్ల ప్రపంచంతో పాటు టీటీడీకి కూడా సాధారణంగా రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు.ఈ నేపథ్యంలో యాగం చేయడం ద్వారా ప్రపంచ ప్రజలతో పాటు టీటీడీ కూడా ఇంతవరకు కోల్పోయిన ఆదాయం తిరిగి పొంది, ఇబ్బందులన్నీ అధిగమించి, అందరూ ఆరోగ్యం గా ఉండాలని శ్రీ వారిని, శ్రీ మహాలక్షిని ప్రార్థించామన్నారు.యాగం తో శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ధన ప్రద యాగం చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి దేవి అందరినీ ఆశీర్వదించి కోల్పోయి సంపద తిరిగి ప్రసాదిస్తారని వేద విశ్వవిద్యాలయం వి.సి.ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ వివరించారు.నారద పురాణంలో ఈ యాగం ప్రాముఖ్యత గురించి స్పష్టం గా పేర్కొన్నారని ఆయన తెలిపారు. సాధారణంగా పరమ శివుడి పూజకు బిల్వాలు, మహావిష్ణువు పూజకు తులసీ ఆకులు ఉపయోగిస్తారని అన్నారు.కానీ పవిత్ర మైన ధనుర్మాసం లో మాత్రం శ్రీ మహా విష్ణువును బిల్వం, తులసి, కమలం తో పూజిస్తారని ఆయన చెప్పారు.వేద మంత్తోచ్చారణ మధ్య యాగంస్వామి వారిని తన దేవేరులైన శ్రీదేవి,భూదేవి తో పాటు యాగశాలలో వేంచేపు చేశారు. శ్రీ వేంకటేశ్వర దశ నామ స్తోత్రం, మహాలక్షి స్తోత్రం తో పాటు వేద మంత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చిస్తూ యాగం నిర్వహించారు.అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎఫ్ ఏ సి ఏవో శ్రీ బాలాజి, సి ఏవో శ్రీ శేషశైలేంద్ర, డిప్యూటి ఈఓ శ్రీ రమణ ప్రసాద్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ తో పాటు వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.