DailyDose

దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల బదిలీ-తాజావార్తలు

Breaking News - CJIs And Judges Transferred Across India

* దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీపలు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు(సీజే), న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది.- ఒడిశా హైకోర్టు సీజే మధ్యప్రదేశ్​కు, మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి గుజరాత్​కు బదిలీ అయ్యారు.- ఐదుగురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి లభించింది.★ దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేసింది సుప్రీంకోర్టు.★ ఈ నెల 14న జరిగిన సుప్రీం కొలీజియం సమావేశంలో ఈమేరకు ఖరారు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది.★ ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రఫీక్​ మధ్యప్రదేశ్​కు బదిలీ అయ్యారు.★ సిక్కిం హైకోర్టు సీజేను ఆంధ్రప్రదేశ్​కు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం నిర్ణయం తీసుకుంది.★ మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తిని గుజరాత్​కు బదిలీ చేశారు.ఎవరెవరు ఎక్కడ..?★ ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్‌ రఫీక్‌ మధ్యప్రదేశ్‌కు బదిలీ.★ సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గోస్వామి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ.★ మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్‌ కొఠారి గుజరాత్‌కు బదిలీ.★ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ఉత్తరాఖండ్‌కు బదిలీ.★ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి సిక్కింకు బదిలీ.★ మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ.★ జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్‌ బిందాల్‌ కోల్‌కతాకు బదిలీ.★ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ.★ మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌ చంద్ర శర్మ కర్ణాటకకు బదిలీ.ఐదుగురికి పదోన్నతి★ పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ మురళీధర్‌కు ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి.★ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీకి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి.★ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్‌ బెనర్జీకి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి.★ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్‌ మిత్తల్​కు జమ్ముకశ్మీర్‌ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి.★ ఉత్తరాఖండ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియాకు గువాహటి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి.

* కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా షేర్‌ చేసిన రైల్వే వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.ఇండియన్‌ రైల్వేకు చెందిన ఓ రైలుపై అదానీ గ్రూపుకు చెందిన స్టాంప్‌ ఉండటంపై వివరణ ఇచ్చింది.‘‘భారత ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్టాంపును ఇండియన్‌ రైల్వేకు చెందిన ఓ రైలుపై అంటించిందన్న వాదన తప్పుదారి పట్టించేదిలా ఉంది.ఆ స్టాంప్‌ రైల్వే శాఖ ఆదాయం పెంచడానికి వేసిన వ్యాపార ప్రకటన మాత్రమే’’ అని ప్రెస్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో(పీఐబి) పేర్కొంది.కాగా, ప్రియాంక గాంధీ ఈ నెల 14న ఈ వీడియోను తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

* ఏపీ రాజధాని కోసం పోరాటం ఉధృతమవుతోంది. అమరావతి రైతుల పోరాటం బుధవారం నాటికి 365 రోజులకు చేరుకున్న సందర్భంగా మందడంలో రైతులు, మహిళలు చేస్తున్న దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళలు ముందుండి 365 రోజుల పాటు నడిపించిన ఉద్యమం ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం.

* రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.దీనిపై విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశామని ఆయన వెల్లడించారు.దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎస్‌ఎల్‌పీపై సర్వోన్నత స్థాయస్థానం స్టే ఉత్తర్వులిస్తే విచారణ ఆపుతామని తేల్చి చెప్పింది.ప్రస్తుతానికి వాదనలు వినిపించాలని ఆదేశించింది. దీనిపై విచారణ గురువారానికి వాయిదా వేసింది.పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.అక్టోబర్‌ 1న విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తేలుస్తామని ఉత్తర్వులిచ్చింది.

* తమిళనాడు, పుదుచ్చేరిలలో మూడు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్ర డైరెక్టర్‌ పువిఅరసన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.బుధవారం నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర సముద్రతీర జిల్లాలు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అంతర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.చెన్నై, శివారు ప్రాంతాల్లో గరిష్ఠంగా 31 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠంగా 22 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతాయన్నారు.

* డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలు నిలిపివేత వాస్తవం కాదని.. ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్ తెలిపింది.మద్యం విక్రయాలు నిలిపివేస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది.ప్రభుత్వం నిర్ధేశించిన పని వేళలకు అనుగుణంగానే మద్యం విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేసింది.

* ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటుగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను స్వాధీనం చేసుకున్నారు. రూ. 4 కోట్ల 47 లక్షలతో పాటు.. రూ. 2 కోట్ల 29 లక్షల డీడీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో దేవికారాణిని సెప్టెంబర్ 4న మరోసారి అరెస్ట్ అయ్యారు. దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

* ప్రజా రాజధాని కోసం విజయవాడలో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది.రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేపట్టిన ఉద్యమం ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు విజయవాడలో మహాపాదయాత్ర నిర్వహించారు.మధ్యాహ్నం 3గంటలకు పడవల రేవు సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, రైతులు, ప్రజలు వేలసంఖ్యలో కదం తొక్కారు.

* వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కుమార్‌ జర్మనీ పౌరుడేనని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ హైకోర్టుకు నివేదించింది. జర్మనీ పౌరసత్వాన్ని 2023 వరకు ఆయన పొడిగించుకున్నారని వివరించింది. తన భారత పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని రమేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఇవాళ విచారణ చేపట్టారు. చెన్నమనేని పౌరసత్వం వివరాలను కేంద్ర హోంశాఖ మెమో రూపంలో సమర్పించడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని మరోసారి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 20కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

* తమ దేశం సరైన మార్గంలో ప్రయాణించడం లేదని పాకిస్థాన్ ప్రజలు భావిస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రతి ఐదుగురిలో నలుగురు తమ దేశం తప్పుదిశలో పయనిస్తుందని అభిప్రాయపడుతున్నట్లు ఐపీఎస్‌ఓఎస్ అనే రిసెర్చ్‌ కంపెనీ చేసిన సర్వేలో బయటపడింది. 23 శాతం మంది దేశం సరైన మార్గంలో నడుస్తుందని భావిస్తుండగా..77 శాతం మంది మాత్రం విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో వెయ్యిమందిపై నిర్వహించిన సర్వేలో ప్రజల మనసులో మాట వెలుగులోకి వచ్చింది. కాకపోతే గతేడాదితో పోల్చుకుంటే ఈసారి దేశ నిర్ణయాలపై నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు 21 శాతం మంది సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించగా..79 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు.