Sports

హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ బయోపిక్

హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ బయోపిక్

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎమ్‌ఎస్‌ ధోనీ, అజహర్‌, మేరీకోమ్‌ లాంటి క్రీడాకారుల జీవిత కథలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు మరో దిగ్గజ క్రీడాకారుడి జీవితం వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్‌లో సిద్ధమవుతున్నారు. భారత్‌కు ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలను సాధించిపెట్టిన హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఉడ్తా పంజాబ్‌, సొన్‌చిడియా లాంటి చిత్రాలను తెరకెక్కించిన అభిషేక్‌ చౌబే దీనికి దర్శకత్వం వహించనున్నారు. ‘భారతదేశం గర్వించదగ్గ మేటి హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌. ఆయన జీవితాన్ని తెరకెక్కించే అవకాశం రావడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మొదలయ్యే షూటింగ్‌ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఓ అగ్రహీరో ధ్యాన్‌చంద్‌ పాత్రను పోషించే అవకాశం ఉంది’ అని దర్శకుడు అభిషేక్‌ చెప్పుకొచ్చారు. రంగ్‌ దే బసంతి, ఉరి.. లాంటి చిత్రాలను నిర్మించిన రోని స్క్రూవాలా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.