* టమాటాలు తీసుకురావడానికి వెళ్లి… హైదరాబాద్ నుంచి విశాఖకు…ఈనెల 14న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇద్దరు చిన్నారులు ఇంట్లో నుంచి టమాటాల తీసుకురావాడానికి బయటకు వెళ్లారు. సైకిల్ పై వెళ్లిన ఇద్దరు స్నేహితులు తిరిగి ఇంటికి రాలేదు.హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. ఇద్దరు వెళ్లి విశాఖలో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు చిన్నారుల ఆచూకీ కనుగొన్న విశాఖ త్రీ టౌన్ పోలీసులు గుర్తించి పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్‌కు చెందిన 12ఏళ్ల బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. టమాటాలు తీసుకురావడానికి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఈ నెల 14న రాత్రి 8.30 గంటలకు ఇంటి పక్కనే ఉంటున్న తన స్నేహితుడిని (12) వెంట తీసుకొని టమాటాలు తీసుకొద్దామని సైకిల్‌పై కలిసి బయటకు వెళ్లారు.అయితే ఎంత సేపయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖ రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు చిన్నారులను విశాఖ త్రీ టౌన్ పోలీసులు గుర్తించారు. వారిద్దర్నీ చేరదీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇన్‌స్పెక్టర్ రమేష్ ఒక పోలీస్ బృందాన్ని విశాఖకు పంపారు. చిన్నారులిద్దరూ క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు…అయితే చిన్నారులిద్దరూ పబ్జీ గేమ్‌కు బాగా అలవాటుపడి, ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంట్లోంచి ఎందుకోసం వెళ్లారు? ఎంత డబ్బు తీసుకెళ్లారు..? విశాఖ ఎలా వెళ్లారన్న వివరాలు తెలియాల్సి ఉంది. చిన్నారులు నగరానికి వచ్చిన తర్వాతనే పోలీసుల ఈ వివరాల్ని వివరించనున్నారు…
* ఘోర రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి.ఉత్తర్‌ప్రదేశ్ సంభల్‌లో ఘోర ప్రమాదం జరిగింది.బస్సు, గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
* ♦️వరంగల్ రూరల్:సంగెం మండలంలో ఘోర రోడ్డుప్రమాదం…♦️రెండు బైక్లు ఢీ కొనీ, ఒక బైక్ లారీ కిందికి దూసుకెళ్ళింది♦️రెండు బైకులపై వెళ్తున్న ఐదుగురి గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.♦️హుటాహుటిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు.♦️ముగ్గురు గాంధీనగర్ వాసులు ఉన్నట్లు సమాచారం♦️మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
* కర్నూలుజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించాలన్నారు.క్షతగాత్రుల చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
* కృష్ణాజిల్లాజగ్గయ్యపేట మండలం బండి పాలెం లో దారుణం.కట్నం ఇవ్వలేదని అత్త,మామ లను గొంతు కోసి చంపిన అల్లుడు.4 నెలల క్రితం మైనర్ బాలిక మనీషాను ప్రేమ వివాహం చేసుకున్న నెమలి బాబు.కట్నం కావాలంటూ మామ కోటా ముత్తయ్య ,అత్త సుగుణమ్మ లను వేధిస్తున్న అల్లుడు నెమలి బాబు.భార్య సహకారంతో అత్తామామలను గొంతు కోసి చంపిన అల్లుడు.మనీషా ,నెమలి బాబులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.