అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన క్యాబినెట్ మంత్రుల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పీట్ బుట్టిగేగ్‌ను ఆయన తాజాగా పరిచయం చేశారు. బైడెన్ క్యాబినెట్‌లో ఎల్‌జీబీటీక్యూ వర్గానికి చెందిన స్వలింగ సంపర్కుడికి స్థానం దక్కడం విశేషం. అమెరికా క్యాబినెట్ చరిత్రలోనే గే వ్యక్తి మంత్రి కావడం కూడా ఇదే తొలిసారి. స్వలింగ సంపర్కుడైన పీట్ బుట్టిగేగ్ .. బైడెన్ క్యాబినెట్‌లో అతి చిన్న వయస్కుడు కూడా. అమెరికా క్యాబినెట్ భిన్నంగా ఉంటుందన్న ఆలోచనతో బైడెన్ తన టీమ్‌ను ప్రకటిస్తున్నారు. బైడెన్ క్యాబినెట్‌లో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ నియమితులైన విషయం తెలిసిందే. ఓ మహిళకు ఆ పోస్టు దక్కడం అమెరికా చరిత్రలోనే ఇది మొదటిసారి. ఇక రక్షణ శాఖ మంత్రిగా లాయిడ్ ఆస్టిన్‌ను నియమించారు. ఆ పదవిని నిర్వర్తించనున్న తొలి నల్లజాతీయుడిగా ఆయన రికార్డు క్రియేట్ చేయనున్నారు. ఇక ట్రెజరీ శాఖకు తొలిసారి జానెట్ యెల్లెన్ అనే మహిళను కేటాయించారు. బైడెన్ క్యాబినెట్‌లో పీట్ బుట్టిగేగ్ తొమ్మిదో వ్యక్తి కాగా, ఆయన గే కావడం విశేషం. ఇండియానా రాష్ట్రంలోని సౌత్ బెండ్‌కు మేయర్‌గా చేశారాయన. వాస్తవానికి అధ్యక్ష రేసులో పోటీ పడ్డ పీట్.. ఆ తర్వాత బైడెన్‌కు మద్దతును ప్రకటించారు.
బైడెన్ కార్యవర్గంలో గే!
Related tags :