ఆముదమా… అంటూ ముఖం అదోలా పెట్టకండి… చర్మసౌందర్యానికీ శిరోజాల సంరక్షణకి ఆముదం చేసే మేలెంతో అంటున్నారు సౌందర్య నిపుణులు.
* కాలిన లేదా కమిలిన చర్మంమీద ఆముదంలో ముంచిన దూదిని పెట్టి ఓ గంటసేపటి తరవాత కడిగేస్తే త్వరగా తగ్గుతుంది.
* కొంచెం ఆముదాన్ని ఒంటికి పట్టించి మర్దన చేస్తే చర్మంలో సాగే గుణం పెరిగి మృదువుగా తయారవుతుంది. ముఖ్యంగా కళ్లకింద రాస్తే అక్కడి ముడతలు తగ్గి చర్మం మెరుస్తూ వయసుని కనబడనీయకుండా చేస్తుంది.
* రెండు చుక్కల ఆముదాన్ని కాసిని గోరువెచ్చని నీటిలో కలిపి ముఖానికి పట్టించి మృదువుగా మర్దన చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. ఆముదంలోని రిసినోలియాక్ ఆమ్లం మొటిమలకి కారణమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది.
* ముఖమ్మీద మచ్చలుంటే రోజూ కాస్త ఆముదంతో అక్కడ రాయడంవల్ల అవి క్రమంగా తగ్గుతాయి. అలాగే గర్భం దాల్చినపుడు వచ్చిన చారలు తగ్గేందుకూ ఇది పనిచేస్తుంది.
* రాత్రిపూట తలకి ఆముదాన్ని పట్టించి బాగా మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల జుట్టు పెరగడంతోబాటు తలలోని ఇన్ఫెక్షన్లూ తగ్గుతాయి. తెల్లబడటమూ తగ్గుతుంది. పైగా ఇది జుట్టుకి కండిషనర్‌లానూ పనిచేస్తుంది.
ఆముదంతో చర్మం కేశాలకు నునుపు
Related tags :