DailyDose

ఈతకు వెళ్లి ఏడుగురు గల్లంతు-నేరవార్తలు

ఈతకు వెళ్లి ఏడుగురు గల్లంతు-నేరవార్తలు

* సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.ఈ సంఘటన సిద్ధవటంలో గురువారం చోటుచేసుకుంది.పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు.. తిరుపతి కోరగుంటకు చెందిన సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ సిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు వచ్చారు.సరదాగా ఈత కొడదామని నదిలో దిగారు. దీంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.

* రాజంపేట దగ్గర సిద్ధవటం స్వర్ణముఖి నదిలో తిరుపతి కొర్లగుంట కి చెందిన ఎనిమిది మంది యువకులు గల్లంతు సెల్ఫీల కోసం వెళ్లి ఏడు మంది యువకులు మృతి ఒక వ్యక్తి మృతి పడిపోయారు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

* బెంగళూరు పోలీసు శాఖలో విషాదం..స్నేహితురాలి ఇంట్లో సీఐడీ డీఎస్పీ ఆత్మహత్య..బెంగళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధ‌వారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో తన స్నేహితురాలి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లాన‌కి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు.పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మి 2017 లో విధులలో నియ‌మితులయ్యారు.ల‌క్ష్మి ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగ‌ళూరు లోని అన్న‌పూర్నేశ్వ‌రి న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో డీఎస్పీగా ప‌ని చేస్తున్నారు.అయితే త‌న స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన ల‌క్ష్మి.. అక్క‌డ గ‌దిలోకి వెళ్లి ఎంత‌కి ల‌క్ష్మి బ‌య‌ట‌కు రానందున త‌లుపులు బ‌ద్ద‌లు కొట్ట‌డంతో ఉరివేసుకుని ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

* దిల్లీలో నిరసనలు చేపట్టిన రైతులకు మరో చేదు వార్త అందింది. దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పంజాబ్​కు చెందిన భీమ్​ సింగ్​గా గుర్తించారు.

* ప్రభుత్వ ఉద్యోగాలకు కారుణ్య నియామకాల్లో వివాహమైన కుమార్తె కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు.వివాహమైన కుమార్తెను అనర్హురాలిగా పరిగణించటం వివక్షాపూరితం, రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.భువనేశ్వరి వి. పురానిక్​ అనే వివాహిత మహిళ మరణించిన తన తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకాల్లో భాగంగా ఇచ్చేందుకు నిరాకరించటాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.ఈ వ్యాజ్యంపై విచారించిన జస్టిస్​ ఎం.నాగ ప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.కుమారుడికి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా కారుణ్య నియామకం కోరే హక్కు ఉన్నప్పుడు కుమార్తె విషయంలో తేడా ఉండకూడదని స్పష్టం చేసింది.

* బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్​పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.ఈ ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్​ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్​కు సంబంధించి ఆసక్తికరమైన సంవాదం జరిగింది.హెబీస్ రిక్విజల్ పిటిషన్​పై పిటిషనర్లకు నోటీసులిచ్చారా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది.తమకు నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు సమాధానమివ్వగా పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా విచారణలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది.ఇది కోర్టు ప్రొసీడింగ్స్​ను అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది.

* అనంతపురం నగరంలోని పాతూరు చెన్నకేశవస్వామి దేవాలయంలో గోపురంపై ఉన్న విగ్రహం ధ్వంసానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు.

* తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేశారు.నిర్మాణ పనులు అడ్డుకునేందుకు నిరసన కారులు లోపలకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.ఆగ్రహించిన నిరసనకారులు సామగ్రి గోడౌన్ కు నిప్పంటించారు.