సామాజిక న్యాయానికి బీసీలు ప్రతినిధులని.. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ల ఛైర్మన్లపై ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన ‘బీసీ సంక్రాంతి’ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇటు ప్రభుత్వం.. అటు బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఛైర్మన్లంతా అనుసంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో దాదాపు 728 మంది బీసీలకు వివిధ స్థానాలు కల్పించడం ద్వారా ఆ సామాజిక వర్గాలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు వేశామన్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్ల ఎంపికలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. ప్రమాణ స్వీకారం చేసిన 56 మంది ఛైర్మన్లలో 29 మంది మహిళలు ఉండడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ బాధ్యతలను ఎంతో పవిత్రంగా భావించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
బీసీలపై జగన్ ప్రశంసలు
Related tags :