దక్షిణాది నటి, బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్రలకు పరిమితమవ్వాలని తాను కోరుకోవడం లేదని అంటోంది పూజాహెగ్డే. అన్ని భాషల్లో నటిస్తూ పాన్ ఇండియన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనుందని చెబుతోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో అగ్రకథానాయకులతో సినిమాలు చేస్తోంది ఈ సొగసరి. కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలల పాటు సినిమాలకు విరామాన్ని తీసుకున్న పూజాహెగ్డే తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యింది. ఈ బిజీలైఫ్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కలిసిరావాలనే సిద్ధాంతాన్ని నేను విశ్వసిస్తా. ఎలాంటి వారసత్వం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టా. తొలినాళ్లలో పరాజయాలు ఎదురైనా నిరాశచెందకుండా నా ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే రోజు కోసం ఎదురుచూశా. ఆ నిరీక్షణ ఫలించింది.ప్రస్తుతం సినీ పరిశ్రమలో భాషల పరంగా ఉన్న హద్దులు చెరిగిపోతున్నాయి. మంచి సినిమాలు, పాత్రలు ఏ భాషలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు తెలుగు చిత్రసీమ కథానాయికగా నాకు జీవితాన్ని ప్రసాదించింది. అలాగని తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తా. తెలుగు నటి, బాలీవుడ్ హీరోయిన్ అనే పిలుపు కంటే భారతీయ నటి అనే గుర్తింపును కోరుకుంటున్నా.’ అని తెలిపింది. ప్రస్తుతం పూజాహెగ్డే నటిస్తున్న ‘రాధేశ్యామ్’, ‘సర్కస్’ చిత్రాలు పీరియాడికల్ కథాంశాలతో తెరకెక్కుతున్నాయి. వీటి గురించి చెబుతూ ‘ కెరీర్‌లో ఒక్క పీరియాడికల్ సినిమా చేయకుండానే తమ కెరీర్‌ను ముగించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. నాకు మాత్రం ఎక్కువగా పీరియాడికల్ సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. అది అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.
నా గురించి ఇండియా మొత్తం చెప్పుకోవాలి
Related tags :