NRI-NRT

విజయవాడ పేద విద్యార్థులకు పొట్లూరి రవి ఆర్థిక సాయం

TANA Secretary Potluri Ravi Awards Merit Scholarships To Vijayawada Students

కరోనా వైరస్ వలన తల్లితండ్రులు ఉపాధి కోల్పోయి విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులు పడుతుండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి పొట్లూరి రవి తన సొంత నిధులతో, మిత్రుల ద్వారా గత మూడు నెలలలో దాదాపు వంద మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మోహిత్ విజయసాయి, తొమ్మిదో తరగతి చదువుతున్న తరుణ్ రోహిత్, ఎనిమదవ తరగతి చదువుతున్న సాయి జాహ్నవిలకు 57,000 రూపాయల ఉపకారవేతనాలు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అన్ని దానాలలో విద్యాదానం గొప్పదని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన రవి పొట్లూరి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బషీర్, ఫణి తదితరులు పాల్గొన్నారు