Politics

జగన్ సర్కార్‌కు సుప్రీంలో ఊరట-తాజావార్తలు

Telugu News Roundup Today - Jagan Govt Gets Relief In Supreme Court

* ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట.రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లను విచారించిన హైకోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్‌ 1న ఉత్తర్వులు ఇచ్చింది.కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది.ఏపీ సర్కార్ పిటిషన్​పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనంలో శుక్రవారం విచారణ జరిగింది.హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ వినతికి ధర్మాసనం సమ్మతించింది.శీతాకాల సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.

* ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
►ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఆమోదం
►ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే చెల్లించాలని నిర్ణయం
►నివార్‌ తుపాను బాధితులకు ఈనెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం
►చంద్రబాబు బకాయి పెట్టిన 1200 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాం
►ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆమోదం
►ఏపీలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకానున్నాయి
►మొత్తం 27 మెడికల్‌ కాలేజీలకు రూ.16వేల కోట్ల నిధులు
►ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం
►ప్రతీ భూమికి సబ్‌ డివిజన్‌ ప్రకారం మ్యాప్‌ తయారు
►ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక పాలసీని ఆమోదించిన కేబినెట్
►6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
►కొత్త పర్యాటక విధానానికి ఆమోదం
►కోవిడ్‌ కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్‌ ప్యాకేజీకి ఆమోదం
►రూ.198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఆర్థికసాయం
►హోటల్‌ రంగం రీస్టార్ట్‌ కోసం రూ.15 లక్షల వరకు రుణం
►మొదటి ఏడాదికి 4.5 శాతం రాయితీతో వడ్డీ రుణాలు
►సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం

* రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన ఎస్‌ఈసీ.రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది.ఎన్నికలకు సహకరించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టనట్టుగా ఉంటోంది హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసింది.ఎన్నికల కమిషన్ లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడంలేదని పేర్కొంది.రాష్ట్ర సీఎస్‌ ప్రతిస్పందన సరిగా లేదని ఫిర్యాదు చేసింది.ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని ఎస్‌ఈసీ కోరింది.

* ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్నికి ఘనంగా సత్కారం. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలో సీఎస్ శ్రీమతి నీలం సాహ్నిని సత్కరించిన మంత్రి మండలి.

* భారతీయ వృత్తి నిపుణులు 2021 ఏడాదిలోకి ఆశావాదంతో అడుగు పెట్టబోతున్నారు. ప్రతి అయిదుగురిలో ఇద్దరు (40 శాతం) వచ్చే ఏడాది కొత్త ఉద్యోగాలు పెరుగుతాయనే భావిస్తున్నారు. 2020కి సంబంధించి నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వే వివరాలను లింక్డ్‌ఇన్‌ గురువారం వెలువరించింది. సుమారు 21,066 మందిని ఏప్రిల్‌-నవంబరు మధ్యలో సర్వే చేసి ఈ నివేదికను రూపొందించింది.

* ఆదిలాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన పట్టణంలోని తాటిగూడలో చోటుచేసుకుంది. పాతకక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్‌ అహ్మద్‌.. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరపడంతో పాటు మరొకరిపై తల్వార్‌తో దాడి చేశారు. కాల్పుల ఘటనలో జమీర్‌, మోతేషాన్‌ గాయపడ్డారు. తల్వార్‌తో జరిపిన దాడిలో మన్నన్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

* ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 69,062 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒకే ఒక్క మరణం నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,070కి చేరింది. ఒక్క రోజులో 534 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,377 యాక్టివ్‌ కేసులున్నాయి.

* పోతిరెడ్డిపాడు కారణంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ సంయుక్త కార్యదర్శిని ఆయన కలిసి పోతిరెడ్డిపాడు అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎన్నిసార్లు తాము మొరపెట్టుకున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే కేంద్ర జలశక్తి శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు.

* ప్రస్తుత కాలంలో అప్పుపుట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. వీజీగా లోన్స్‌, క్రెడిట్స్‌ ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో ద్రవ్య సంస్థలు గాలం వేస్తున్నాయి. తర్వాత లోన్‌ రికవరీ చేసేటప్పుడు విపరీతమైన చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందువల్ల సులభ పద్ధతిలో వచ్చే అప్పుల విషయంలో జాగ్రత్తలు అవసరమని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో వీజీలోన్స్‌ పేరుతో మోసం చేసేందుకు అయిదు వందలకు పైగా ఫ్రాడ్‌ యాప్‌లు ఉన్నాయని పేర్కొన్నారు.

* కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సాధారణ రైలు సేవల ప్రారంభ తేదీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని చెప్పారు. ఈ మేరకు దిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సాధారణ రైళ్లస్థానంలో ప్రస్తుతం 1,089 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని వీకే యాదవ్‌ అన్నారు.

* కొవిడ్‌ నిరోధక టీకా త్వరలోనే అందుబాటులోకి రానుందనే సమాచారం దేశంలో ఊరట కలిగిస్తోంది. తొలివిడతగా 30 కోట్ల మందికి టీకాలను అందచేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా రోజుల వ్యవధిలోనే అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌, ఏ ఇతర దేశాలకూ తీసిపోదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల సందేహాల నివృత్తి కోసం.. టీకాలకు సంబంధించిన సమాచారంతో ఓ ప్రకటనను విడుదల చేసింది.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ అత్యాచార ఘటనలో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొంది. నలుగురు నిందితులపై అత్యాచారం, హత్య అభియోగాలు మోపింది. ఈ మేరకు సందీప్‌, లవ్‌కుష్‌, రవి, రాము అనే నలుగురిపై స్థానిక కోర్టులో అభియోగాలతో కూడిన ఛార్జిషీటు దాఖలు చేసింది.

* కరోనా నియంత్రణ మార్గదర్శకాల అమల్లో లోపాల కారణంగా దేశంలో కొవిడ్‌ దావాగ్నిలా వ్యాపిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ 19పై ప్రపంచ యుద్ధం జరుగుతోందని, ఈ మహ్మమారి కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

* పశ్చిమబెంగాల్‌ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి షాకిస్తూ.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి పలువురు నేతలు గుడ్‌బై చెబుతున్నారు. కీలక నేత సుబేందు అధికారి సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీతో సంబంధాలు తెంచుకున్నారు. ఆయన తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను బెంగాల్‌ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ తిరస్కరించారు.

* ‘మణికర్ణిక’.. ఝాన్సీలక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్‌ కథానాయికగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన సినీ ప్రియుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో కంగన-క్రిష్‌ మధ్య జరిగిన వివాదం ఏమిటి?‘మణికర్ణిక’ దర్శకత్వాన్ని ఉద్దేశిస్తూ అప్పట్లో కంగన ఎందుకు అలా ట్వీట్‌ చేశారు?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతూ సదరు వివాదం గురించి తాజాగా దర్శకుడు క్రిష్‌ స్పందించారు.