Fashion

బంగారం క్యారెట్ల కథ ఇది

బంగారం క్యారెట్ల కథ ఇది

క్యారెట్ అంటే ఏమిటి..? 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారానికి తేడాలేంటి..?
****బంగారం కొనుగోలు చేసే వారికి 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గురించి మంచి అవగాహన ఉంటుంది. కానీ ఈ తేడాలు తెలియని కొందరిని ఉద్దేశించినదే ఈ కథనం..
*బంగారం గురించి తెలిసిన వారికి 22 క్యారెట్లు, 24 క్యారెట్లు అనే పదాలు తెలిసే ఉంటాయి. ఈ రెండింటికి తేడాలేంటో గోల్డ్ షాపింగ్ చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి తెలుసు. కానీ కొందరికి మాత్రం ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి. క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు.స్వర్ణం ఎంతో సున్నితమైంది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.
*బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది.
***స్వర్ణం ఎంతో సున్నితమైంది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.
**24 క్యారెట్ల బంగారం
ఇది 99.9 శాతం స్వచ్ఛమైంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 24 క్యారట్ల బంగారానికి మించిన బంగారం ఉండదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ఖరీదైంది. 24 క్యారెట్ల బంగారం పెట్టుబడులకు ఓకేగానీ.. దీంతో ఆభరణాలు తయారు చేయలేం.
**22 క్యారెట్ల బంగారం
ఇందులో 22 వంతుల బంగారం ఉంటే.. రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్‌గా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం.
**18 క్యారెట్ల బంగారం
ఇందులో 18 భాగాల పసిడి ఉంటే.. ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్‌గా, మన్నికగా ఉంటుంది.
**14 క్యారెట్ల బంగారం
ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర తక్కువ. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యం అవుతుంది.