వయసు పెరిగేకొద్దీ కంటిచూపు మసకబారడం సహజమే. అయితే జింక్, కాపర్, విటమిన్-సి, విటమిన్-ఇ, బీటాకెరోటిన్, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా వయసుతోబాటు వచ్చే కంటి క్షీణతని చాలావరకూ తగ్గించుకోవచ్చు అంటున్నారు కంటి నిపుణులు.
* చేపలు, చేపనూనెల్లో ఒమెగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని వారానికి రెండుమూడుసార్లయినా తీసుకోవాలి. ముఖ్యంగా పొడిబారిన కళ్లకి చేప చక్కని పరిష్కారం.
* వాల్‌నట్స్, జీడిపప్పు, వేరుసెనగపప్పు… వంటి నట్స్‌లోనూ అవిసె, చియా వంటి గింజల్లోనూ సమృద్ధిగా ఉండే విటమిన్-ఇ, ఫ్యాటీ ఆమ్లాలు కూడా కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
* నిమ్మ, నారింజ… వంటి సిట్రస్ పండ్లలోని విటమిన్-సి, ఇ, లు కూడా కళ్లు దెబ్బతినకుండా చేస్తాయి.
* విటమిన్-సితోబాటు ల్యూటెన్, జియాక్సాంథిన్ పుష్కలంగా ఉండే పాలకూర, క్యాబేజీ; విటమిన్-ఎ సమృద్ధిగా ఉండే క్యారెట్లు; విటమిన్-ఇ ఎక్కువగా ఉండే చిలగడదుంపలూ; ఇవన్నీ పుష్కలంగా ఉండే గుడ్లూ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇవన్నీ తినడంతోబాటు నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కళ్లు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.సరైన ఆహారం తీసుకోవడంతో బాటు ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌గ్లాసెస్ వాడటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం, కంప్యూటర్ మీద నుంచి ఇరవై నిమిషాలకోసారి దృష్టి మరల్చి 20 అడుగుల దూరం వరకూ 20 సెకన్లపాటు చూడటం వంటివి చేస్తే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
మీ కంటి ఆరోగ్యానికి ఈ చిట్కాలు ప్రయత్నించండి
Related tags :