పచ్చదనం కళ్లకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందిస్తుంది అంటున్నారు డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటే చిన్నతనం నుంచీ పచ్చని మొక్కల్ని చూస్తూ ఆ మొక్కలూ చెట్ల మధ్య ఆడుకుంటూ పెరిగే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్…వంటి మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది పిల్లలు వాయు కాలుష్యంతో నిండిపోయిన నగరాల్లోనూ పచ్చదనం లోపించిన భవంతుల్లోనూ జీవిస్తున్నారు. దాంతో కౌమారదశలో చాలామంది పిల్లలు ఒత్తిడికి లోనై రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అలాకాకుండా ప్రకృతిఒడిలో పెరిగిన పిల్లల్లో పెద్దయ్యాక తలెత్తే ఒత్తిడిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అందుకే కనీసం పిల్లలకు పది సంవత్సరాలు వచ్చేవరకయినా వాళ్లని పచ్చదనంతో నిండిన వాతావరణంలో పెంచితే వాళ్లు శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా పెరుగుతారని చెబుతున్నారు.
పచ్చదనాన్ని ఎక్కువగా వీక్షించండి
Related tags :