అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు జరిగాయి. షికాగోలోని మిషిగన్ అవెన్యూలో నగరానికి చెందిన మహ్మద్ ముజీబుద్దీన్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముజీబుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను షికాగో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల విషయాన్ని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ నిర్ధారించారు. ఇటీవల చంచల్‌గూడకు చెందిన సిరాజ్‌పైనా అమెరికాలో కాల్పులు జరిగాయి. ఆయన కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు కారుకు తగలడంతో సిరాజ్ సురక్షితంగా బయటపడ్డారు.
అమెరికాలో మరో హైదరాబాదీ ముస్లిం యువకుడిపై కాల్పులు
Related tags :