నాట్స్ సంస్థ తెలుగువారి కోసం అంతర్జాలంలో బుర్రకథను ఏర్పాటుచేసింది. బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ శిష్యురాలు యడవల్లి శ్రీదేవి కుటుంబం సాయి జీవిత చరిత్రపై బుర్రకథను ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించారు. శ్రీదేవి భర్త విజయకుమార్‌తో పాటు ఆమె తనయుడు నందకిషోర్ కూడా పాల్గొని వీక్షకులను ఆకట్టుకున్నారు. సమన్వయకర్తలుగా నాట్స్ నాయకులు డాక్టర్ సూర్యం గంటి, డాక్టర్ మధు కొర్రపాటి, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, రాజేశ్ కాండ్రు, శివ తాళ్లూరు, ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.
నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ బుర్రకథ
Related tags :