Politics

పీసీసీ అధ్యక్షుడి బెర్త్ ఖాయం అంట!

Komatireddy Goes To Delhi - PCC President Confirmed

మళ్ళీ ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇక ఫిక్సా..?

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళ్లారు..

పీసీసీ ఫైనల్ అయ్యిందనే వార్తలతో ఢిల్లీకి పయనం అయ్యారు కోమటిరెడ్డి..
తన వంతు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.

పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పటికే ముగ్గురి పేర్లను పరిశీలించింది హైకమాండ్.

ఫైనల్ లిస్టులో రేవంత్, భట్టి విక్రమార్క ఉన్నట్టు సమాచారం..

అభిప్రాయ సేకరణలో రేవంత్‌ కే ఎక్కువగా మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే సీనియర్ల కోణంలో కోమటిరెడ్డి, భట్టి పేర్ల పరిశీలన జరుగుతోంది.

ఈ నెల 23 లేదా 26న పీసీసీ కొత్త చీఫ్ పై ప్రకటన ఉండే అవకాశం ఉంది.

మాస్ ఫాలోయింగ్, అందర్నీ కలుపుకు పోయే వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉంది హైకమాండ్.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సోనియా గాంధీ తో భేటీ అయ్యారు.

ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి ఢిల్లీ ప్రయత్నాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి..

చూడాలి మరి ఏం జరుగుతుంది, అనేది.?!