* శంషాబాద్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోపి ఓ మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.
* యశోద ఆసుపత్రుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.”ఉదయం నుంచి 20కి పైగా బృందాలు ఆసుపత్రులతో పాటు పలువురి వైద్యుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి.”ఆదాయపన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్టు ప్రాథమికంగా ఐటీశాఖ గుర్తించింది.”ఈనేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం.సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశముంది.
* మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సియోని జిలాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
* ఆన్‌లైన్‌లో రుణాల పేరిట ఉన్న అనుమతిలేని యాప్స్‌ను నమ్మొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. రకరకాల పేర్లతో ఆకర్షిస్తున్నారని.. తక్కువ సమయంలో డబ్బు ఇచ్చే సంస్థలన్నీ మోసపూరితమైనవనే విషయాన్ని గ్రహించాలని కోరారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సీపీ మీడియాకు వివరించారు. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు చేశామని.. సుమారు 50 వరకు ఫిర్యాదు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం కేంద్రంగా పనిచేస్తున్న ఆనియన్ క్రెడిట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ సంస్థలకు చెందిన శరత్‌చంద్ర సహా ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఆయా సంస్థలకు చెందిన రూ.1.52కోట్లను ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 22 మొబైల్ ఫోన్లు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
* తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో వివాహిత దారుణ హత్య.కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త.భార్య నాగమణి (30) ని హత్య చేసి పోలీస్ లకు లొంగిపోయిన భర్త యరమల నర్సిరెడ్డి.భార్యపై అనుమానంతో దారుణానికి పాల్పడ్డ నిందితుడు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై లు సుబ్రహ్మణ్యం, అవినాష్ లు.
* జిల్లాలో తుపాకుల అమ్మకాలు కలకలం రేపాయి. దిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌స్టర్ల నుంచి అనకాపల్లి, గాజువాక వాసులు తుపాకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టి తుపాకులు సరఫరా చేస్తున్న దిల్లీ గ్యాంగ్‌స్టర్ అభిషేక్ భరద్వాజ్‌ను అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన సమ్రాట్ దాలి, బంటీ చాట్‌ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు అనకాపల్లి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. అయితే విశాఖ జిల్లాలో తుపాకులు ఎవరికి విక్రయించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.